తల్లి మరణించిన గంటల వ్యవధిలోనే కొడుకు ఆత్మహత్య

KMM: తల్లి చనిపోయిన గంటల వ్యవధిలోనే కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేంసూరు మండలం అడసర్లపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు కరుణాకర్(33) HYDలో ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తన తల్లి పులమ్మ (70) అనారోగ్యంతో చనిపోయింది. విషయం తెలుసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన భార్య ఫోన్‌కు కుమార్తెను బాగా చూసుకో అని మెసేజ్ పంపాడు.