BREAKING: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
TG: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అత్మహత్య ఘటన మరువకముందే.. హనుమకొండలో మరో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్ యత్నం చేసుకున్నాడు. డ్రైవర్ రవీందర్ పురుగుల మందు తాగాడు. ఆయన భూపాలపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధిత రవీందర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.