పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి

SRPT: గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం సూర్యతండాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. టీకాలు వేయడం ద్వారా పశువులను ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని, పాల ఉత్పత్తి, సంతానోత్పత్తిని పెంచుకోవచ్చన్నారు.