'స్టేజ్ ప్రోగ్రామ్స్ కు ముందుగా అనుమతులు తీసుకోవాలి'
అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉత్సవాలు సందర్భంగా స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తే ముందుగా అనుమతులు తీసుకోవాలని డి.ఎస్.పి ఎం.శ్రావణి మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాత్రి 10:30గంటలకు ప్రోగ్రాములు ముగించాలని సూచించారు.స్టేజి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫైర్ సర్వీస్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు.