రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సానియా, ఆది దుర్గ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈనెల 18 నుంచి 19 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారు.