VIDEO: ఎల్‌పీజీ కొరతతో స్టీల్ ప్లాంట్‌కు ఉత్పత్తి సంక్షోభం
విశాఖ ఉక్కులో ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కు ఉత్పత్తి నిలిచే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం ప్లాంట్‌లో కేవలం 120 టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయని కార్మిక నాయకులు తెలిపారు. మరో 300 టన్నుల గ్యాస్ కోసం చెల్లింపులు చేసినప్పటికీ సరఫరా జరగడం లేదని పేర్కొన్నారు. ఇదే కొనసాగితే మరో పది రోజుల్లో ఉత్పత్తి ఆగే అవకాశం ఉందన్నారు.