బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం
RR: మహేశ్వరం డిపో నుంచి కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట, సంగెం గ్రామాల మీదుగా షాద్ నగర్ పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించాలని కేశంపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్ డీఎం లక్ష్మీ సుధకు వినతిపత్రాన్ని అందించారు.ఈ విషయంపై స్పందించిన డిపో మేనేజర్ త్వరలో బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.