లిక్కర్‌ స్కాం.. మాజీ సీఎం కుమారుడి ఆస్తులు అటాచ్‌

లిక్కర్‌ స్కాం.. మాజీ సీఎం కుమారుడి ఆస్తులు అటాచ్‌

ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ CM భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్యకు చెందిన రూ.61.20 కోట్ల విలువైన ఆస్తులను ED అటాచ్ చేసింది. వీటిల్లో రూ.59.96 కోట్ల విలువైన 364 ప్లాట్లు, వ్యవసాయ భూములు, రూ.1.24 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లు ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ED తెలిపింది.