మక్తా కొత్తగూడెంలో జోరుగా ఇసుక దోపిడీ
SRPT: ఆత్మకూర్ (ఎస్) మక్తా కొత్తగూడెం ఏటీ నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల అండతోనే పొరుగు గ్రామాల ట్రాక్టర్లు సైతం ఇసుకను తరలిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటి సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. వెంటనే అక్రమ రవాణాను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు.