తుఫాన్ ఎఫెక్ట్.. వైసీపీ ర్యాలీ వాయిదా
KKD: జగ్గంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీ 'మొంథా' తుఫాన్ కారణంగా వాయిదా వేసినట్లు జగ్గంపేట వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి తోట నరసింహం తెలిపారు. నిరసన ర్యాలీని ఎప్పుడు నిర్వహించాలో త్వరలోనే కార్యకర్తలకు, నాయకులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.