సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవాలు తప్పుకాదు: జూపల్లి
TG: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తప్పులేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. డబ్బులు పెట్టి కొంటే అది ఏకగ్రీవం కాదని స్పష్టం చేశారు. అలా చేస్తే ప్రజాకంటకులు అవుతారని చెప్పారు. డబ్బు ఉందని అహంకారంతో పదవులు కొనుగోలు చేయొద్దని హితవు పలికారు. వేలం పాట ద్వారా ఎన్నికైన వారికి సహకరించనని అన్నారు.