'కోల్ తక్షణం విడుదల చేయాలి'

VSP: గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేటు వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున గంగవరం యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినదించారు.