చెక్ పోస్టు వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు
VZM: పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా ఒడిశా సరిహద్దు చెక్ పోస్టులో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం చెక్ పోస్టు ఎస్సై శంకరరావు ఆధ్వర్యంలో ఒడిశా నుండి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా చట్ట రీత్యా నేరం అని, అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.