రాజు కాలవ నిర్మాణ పనులు ప్రారంభించిన MLC
CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రాజు కాలవ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. పాత కాలువను తొలగించి నూతనంగా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు రూ. 100 కోట్లను కేటాయించారని వెల్లడించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.