వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన అవనిగడ్డ SDPO

వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన అవనిగడ్డ SDPO

కృష్ణా: అవనిగడ్డ సబ్ డివిజన్‌లోని పాత యెడ్లంక గ్రామంలో కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాన్ని శుక్రవారం అవనిగడ్డ SDPO టీ. విద్యశ్రీ, ఎస్సై కే.శ్రీనివాసరావుతో కలిసి పర్యటించారు. వరద ముప్పు నేపథ్యంలో ప్రజల సురక్షిత స్థలాలకు తరలింపుపై అధికారులతో సమీక్ష జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.