భారీ ఎన్‌కౌంటర్.. పాడేరులో హై అలర్ట్
అల్లూరి: మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో నిఘా పెంచి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. కాగా ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు ఆరుగురు మృతి చెందారు.