367 డ్రోన్లతో రష్యా దాడి

ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు తెగబడింది. దాదాపు 367 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రోన్లతో రష్యా దాడి చేయడం ఇదే తొలిసారి. తమ దేశంలోని 30 నగరాలు, గ్రామాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఈ సందర్భంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను కోరారు.