మోమినపూర్‌లో కొత్త బోరు ప్రారంభం

మోమినపూర్‌లో కొత్త బోరు ప్రారంభం

NRPT: మద్దురు మండలంలోని మోమినపూర్ గ్రామంలో గూళ్ళ కాలనీలో ఉన్న మంచినీటి సమస్యను సర్పంచ్ శ్రీదేవి రవికుమార్ పరిష్కరించారు. కాలనీవాసుల విజ్ఞప్తితో కొత్త బోరు వేయించగా నీరు పుష్కలంగా లభించింది. శనివారం మోటార్ ఏర్పాటు చేసి గంగదేవతకు పూజలు నిర్వహించి నీటి సరఫరా ప్రారంభించారు. ఆనందంగా అన్నదానం నిర్వహించారు. సమస్యను తీర్చిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.