చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

BDK: సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో మత్యశాఖ మంజూరు చేసిన 74,100 చేపపిల్లలను శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెరువులో విడుదల చేశారు. గ్రామీణ ప్రజల ఆర్ధిక వ్యవస్థ బలపడేందుకు చేపల పెంపకం దోహదపడుతుందని, సొసైటీలుగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లోని చేపల చెరువులను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని కోరారు.