మాజీ మంత్రితో వైసీపీ నేతల భేటీ

మాజీ మంత్రితో వైసీపీ నేతల భేటీ

పల్నాడు: మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాసు వెంకట కృష్ణారెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నరసారావుపేటలోని ఆయన ఇంటికెళ్లి కలుసుకున్నారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంట్లో వైసీపీ విజయానికి అనుసరించాల్సిన చర్యల గురించి చర్చించారు.