బాలుడు మిస్సింగ్.. కేసు నమోదు
BPT: పిట్టలవానిపాలెం కాజీపాలెంకు చెందిన 7వ తరగతి విద్యార్థి తాటికొండ నాగసాయి ఆదివారం సాయంత్రం ఆటలాడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి తాడికొండ ఆదినారాయణ సోమవారం చందోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకట శివకుమార్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9440900871 నంబర్‌లో తెలియజేయాలని కోరారు.