పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

KMM: రేపు జరగనున్న పదో తరగతి పరీక్షలకు చింతకాని మండలంలో 467 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఎంఈఓ సలాది రామారావు తెలిపారు. నాగులవంచ, పందిళ్లపల్లి, చింతకాని పరీక్షా కేంద్రాల్లో 383 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, 84 మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.