ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

GNTR: ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.