నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: భోగాపురం మండలం ముక్కాం 11kv రూరల్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమతుల చేపడుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE జీ.సురేష్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ముక్కాం, చోడిపల్లి పేట, రామచంద్ర పేట, సబ్బన్నపేట, నందిగాం, తోటపల్లి, బోయపాలెం, తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.