'చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలి'
MNCL: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని నీటి వనరులలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలని కోరారు.