ఐక్యరాజ్యసమితిలో రాజంపేట ఎంపీ ప్రసంగం
అన్నమయ్య: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదివారం ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున ప్రసంగించారు. ఈ మేరకు అంతర్జాతీయ లా కమిషన్ 6వ కమిటీ నివేదికపై ఆయన మాట్లాడుతూ.. పైరసీ, సముద్ర ఆయుధ దోపిడీ నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. దీంతో ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారతదేశం అభ్యంతరాలను కూడా ఆయన తెలియజేశారు.