'బసవేశ్వరుడి బోధనలు, సేవలు చిరస్మరణీయం'
ADB: బజార్ హత్నూర్ మండలం భోస్ర గ్రామంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. గ్రామస్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు గజానంద్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి బోధనలు, సేవలు చిరస్మరణీయమన్నారు. దళిత, బహుజన, గిరిజన, మహిళా సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు.