సింహాచలంలో పెరిగిన భక్తుల రద్దీ

సింహాచలంలో పెరిగిన భక్తుల రద్దీ

విజయనగరం: సింహాచలంలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామికి పూజలు చేసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ఈవో వెంకటరావు పర్యవేక్షణలో సిబ్బందిని ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. అసిస్టెంట్ కార్యనిర్వహణ అధికారి తిరుమలేశ్వర్రావు భక్తులతో మాట్లాడి సదుపాయాలు అడిగి తెలుసుకుంటున్నారు.