ఐస్‌క్రీమ్ బండ్లపై నిషేధం.. రూ.10,000 జరిమానా
NZB: నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఐస్‌క్రీమ్ బండ్లపై నిషేధం విధించారు. గ్రామ సర్పంచ్ ఆర్మూర్ లావణ్యతో పాటు వీడీసీ సభ్యులు కలిసి గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండ్లు అనుమతి లేకుండా ప్రవేశిస్తే రూ.10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.