సీపీఎం సీతారాం ఏచూరి వర్ధంతి కార్యక్రమం

NLR: అనంతసాగరం మండల కేంద్రంలో శుక్రవారం సీపీఎం నేత సీతారాం ఏచూరి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. లౌకిక విలువలు, సోషలిజం కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని సీపీఎం మండల కార్యదర్శి అన్వర్ భాష అన్నారు.