నల్గొండలో పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: ఎస్పీ
నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు. విజేతల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.