50 ఏళ్ల భూ వివాదానికి పరిష్కారం
SS: ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో 50 ఏళ్లుగా నలుగుతున్న 51 సెంట్ల భూ వివాదానికి రాజీ మార్గంలో పరిష్కారం లభించింది. ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ చర్చల అనంతరం భూ యజమానులకు 20 సెంట్లు, గుడిసెలు వేసుకున్న దళితులకు 31 సెంట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ 14 మంది దళితులకు ఇంటి పట్టాలు అందజేశారు.