'ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి'

KMM: శిలాఫలకాలు, ప్రకృతి వనం, చెక్ డ్యామ్ ధ్వంసం చేసిన వ్యక్తులపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావులు డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రుపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.