వినతులు స్వీకరించిన కలెక్టర్
MDK: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.