రహదారి నిబంధనలపై అవగాహన

రహదారి నిబంధనలపై అవగాహన

అనకాపల్లి పట్టణం శారద వంతెన వద్ద వాహనచోదకులకు రహదారి నిబంధనలపై ట్రాఫిక్ సీఐ ఎం వెంకటనారాయణ సోమవారం అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపాడు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు.