'ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాలి'

'ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాలి'

కృష్ణా: అవనిగడ్డలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండులో ప్రయాణికులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం బస్టాండులో మహిళల, పురుషుల మరుగుదొడ్లను పరిశీలించారు. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాలని ఆదేశించారు.