జిల్లా కారాగారం సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కారాగారాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పది స్మార్ట్ టీవీలను జైలుసూపరిటెండెంట్ కె.శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జైలులోని ఖైదీల బ్యారక్‌లు తిరుగుతూ వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జైలర్లు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.