ఘోరం ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

ఘోరం ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

ప్రకాశం: దర్శి మండలం చలివేంద్రం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన యువకుడు పొదిలికి చెందినవాసిగా గుర్తించారు.