'జాతీయస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలి'
PPM: రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో గెలుపొందిన విజేతలు జాతీయస్థాయి పోటీలకు వెళతారని, అక్కడ తమ ప్రతిభతో జాతీయస్థాయిలో గెలుపొంది రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మానసిక శక్తి సామర్థ్యాలను రూపొందించే ఆట చదరంగం అని, క్రీడాకారులు ఈ ఆటలోనే కాక అన్ని క్రీడల్లో తమ ప్రతిభను చాటాలని అన్నారు.