నూతన రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్

నూతన రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్

HYD: ఐఎస్.సదన్ డివిజన్ శంకేశ్వర్ బజార్ కాలనీలో రూ. 7.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.