సర్పంచుల సేవలు అభినందనీయం
ప్రకాశం: గ్రామాలలో ఐదేళ్లపాటు సర్పంచుల సేవలు అభినందనీయమని కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం వెలిగండ్ల మండల కేంద్రంలో మండలంలోని సర్పంచులందరినీ ఆయన ఘనంగా శాలువతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజులలో గ్రామాల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని సూచించారు.