VIDEO: గణేశ్ ఉత్సవాల్లో మహిళల కోలాట నృత్యాలు

ప్రకాశం: కనిగిరిలోని నీలకంఠం వీధిలో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మహిళలు మంగళవారం రాత్రి కోలాట భజనలు నిర్వహించారు. మహిళలు చేసిన కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. నిర్వాహకులు కోలాట నృత్యాలు చేసిన మహిళలను అభినందించారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు కమిటీ నిర్వాహకులు ప్రసాదాలను పంపిణీ చేశారు.