VIDEO: తాగునీటి సమస్యకు చర్యలు
SRD: సిర్గాపూర్ మండలం పోట్పల్లి జీపీలో తాగునీటి సమస్యలకు జీపీ అధికారులు బుధవారం చర్యలు తీసుకున్నారు. గ్రామంలో రెండు చేతి పంపులు, ఒక సింగిల్ ఫేజ్ కరెంట్ బోరు మోటర్‌కు మరమ్మతులు చేసినట్లు సర్పంచ్ తుక్కమ్మ, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా సింగిల్ ఫేజ్ కరెంటు బోరు మోటర్ కొత్త సెట్ బిగించినట్లు చెప్పారు.