'నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి'
MNCL: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ లోని కలెక్టరేట్ లో ఎన్నికల నిర్వహణ, నామినేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.