గంజిపేటలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

గంజిపేటలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

GDWL: గద్వాల పట్టణంలోని గంజిపేట శ్రీ వేంకటేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మారుతి నామస్మరణ చేశారు. పారాయణంతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో మారుమోగాయి.