VIDEO: మల్లవల్లి ఆలయంలో చోరీ

VIDEO: మల్లవల్లి ఆలయంలో చోరీ

కృష్ణా: బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని మహిష్మ తల్లి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి హుండీని అపహరించారు. దొంగలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.