అవార్డు గ్రహిత రైతుకు సన్మానం
NLG: చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర “ఉత్తమ రైతు రత్న” అవార్డు గ్రహీత పజ్జురి అజయ్ కుమార్ రెడ్డిని గ్రామంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఆయనను కలుసుకుని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్న రాజ్ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన చేసిన కృషిని కొనియాడారు.