'పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'
MNCL: పీఎం అజయ్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. పీఎం అజయ్ పథకంలో ఎంపికైన జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీలోని రొమ్మిపూర్ గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మురుగు కాలువల శుభ్రతపై చర్యలు తీసుకోవాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.