విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

WGL: సంగెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు పోటీలు చేపట్టారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఆగస్టు 15న ప్రథమ, ద్వితీయ బహుమతులు అందిస్తామని నిర్వాహకుడు పులి రాజశేఖర్ స్పష్టం చేశారు.