బస్సు ఢీకొని డీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మృతి

బస్సు ఢీకొని డీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మృతి

CTR: చౌడేపల్లి డీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాజీగం చిట్టిబాబు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువుల వివాహానికి హాజరై మద్దిమడుగు హరిజనవాడ నుండి మోటారు బైక్‌పై సత్రంకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిట్టిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, మహిళ గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.